అనూహ్య నిర్ణయం


Mon,January 14, 2019 12:15 AM

Samantha will not play the 70 year-old woman in O Baby Yentha Sakkagunnave

వివాహానంతరం పాత్రల ఎంపికలో తన పంథా మార్చుకుంది సమంత. వినూత్న ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ పాత్రలపరంగా వైవిధ్యాన్ని కనబరుస్తున్నది. నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరియన్ చిత్రం మిస్‌గ్రానీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత 20ఏళ్ల యువతిగా, 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం వృద్ధురాలి పాత్రలో నటించడానికి సమంత విముఖంగా ఉన్నట్లు తెలిసింది. కెరీర్ జోరుమీదున్న ప్రస్తుత తరుణంలో బామ్మ పాత్రలో నటించడం అంత శ్రేయస్కరం కాదనే సన్నిహితుల సలహాతో సమంత వృద్ధురాలి పాత్రకు నో చెప్పిందని అంటున్నారు. ఈ పాత్ర కోసం సీనియర్ నటి లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం. డ్బ్భైఏళ్ల వృద్ధురాలు అనూహ్య పరిస్థితుల్లో 20ఏళ్ల యువతిగా మారితే ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథాంశం.

3465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles