రాయలసీమ ప్రేమకథ

Thu,September 12, 2019 11:32 PM

ట్రైలర్ చూస్తుంటే ఇడియట్ సినిమా గుర్తొస్తుంది. కర్నూల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి అని అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. వెంకట్, వృశాలి, పావని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాయలసీమ లవ్‌స్టోరీ. రామ్ రణధీర్ దర్శకుడు. రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలు. సాయి ఏలేంద్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షన్‌కు మాత్రమే కాదు ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలకు నెలవు అని చాటిచెప్పే చిత్రమిది. ఈ నెల 27న విడుదలచేయనున్నాం అని తెలిపారు. కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తుందని హీరో వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో వృశాలి, ఏలేంద్ర తదితరులు పాల్గొన్నారు.

464

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles