రథేరా రెడీ

Tue,September 17, 2019 12:06 AM

పూల సిద్దేశ్వరరావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జూకట్ రమేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వరరావు, నరేష్ యాదవ్, వైఎస్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సెన్సారు వాళ్లు చిత్రాన్ని చూసి అభినందించి, క్లీన్ యూ సర్టిఫికెట్ అందించారు. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే విశ్వాసం వుంది అని తెలిపారు. సిద్దు, మానస జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ్ వాటికన్స్.

272

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles