అందుకే విడిపోయాం!

Mon,October 21, 2019 12:01 AM

కెరీర్‌ తొలినాళ్లలో కన్నడ హీరో రక్షిత్‌శెట్టితో ప్రేమ వ్యవహారాన్ని నడిపింది అగ్రనాయిక రష్మిక మందన్న. నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. తన విఫల ప్రేమ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రష్మిక మందన్న. ‘నా తొలి చిత్రం ‘కిరిక్‌పార్టీ’ టైమ్‌లో రక్షిత్‌శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే నా ప్రేమకథకు నిశ్చితార్థంతోనే ఫుల్‌స్టాప్‌ పడింది. అంతా సవ్యంగా జరుగుతుందనే విశ్వాసం ఉన్నప్పుడే ఏ బంధాన్నైనా ముందుకు తీసుకెళ్లొచ్చు. అభిప్రాయ భేదాలు తలెత్తితే మధ్యలో వదిలేయడం మంచిది. లేకపోతే భవిష్యత్తులో కష్టాలు వస్తాయి. అయితే బ్రేక్‌అప్‌ వల్ల ప్రేమపై నా నమ్మకాలేవి మారిపోలేదు. ప్రేమ ఎప్పటికీ ఉన్నతమైనదే’ అని చెప్పింది.

1207

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles