ప్రేమికుల సెంటిమెంట్‌!

Tue,September 17, 2019 11:32 PM

ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో సెంటిమెంట్‌ను విశ్వసిస్తారు. సినీ రంగంలో ఈ ధోరణి కాస్త ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాలీవుడ్‌ సరికొత్త ప్రేమజంట రణభీర్‌కపూర్‌, అలియాభట్‌ తాము బలంగా నమ్మే సెంటిమెంట్స్‌ గురించి చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయిక సోనమ్‌కపూర్‌ ప్రస్తుతం ‘ది జోయా ఫ్యాక్టర్‌' చిత్రంలో నటిస్తున్నది. 2011లో జరిగిన క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నమెంట్‌ సందర్భంగా భారత టీమ్‌తో జోయాసింగ్‌ సోలంకి అనే ఎగ్జిక్యూటివ్‌ పనిచేసింది. ఆ సమయంలో ఆమెను భారత టీమ్‌ లక్కీఛార్మ్‌గా అభివర్ణించేవారు. ఆమె కథ స్ఫూర్తితో రచించిన ‘ది జోయా ఫ్యాక్టర్‌' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సోషల్‌మీడియా వేదికపై సోనమ్‌కపూర్‌ అడిగిన ప్రశ్నలకు రణభీర్‌కపూర్‌, అలియాభట్‌ సమాధానమిచ్చారు. ఎనిమిది సంఖ్యను తన జీవితంలో ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తానని, ఆ సంఖ్య ఆకృతి తనలో పాజిటివ్‌ ఎనర్జీని కలిగిస్తుందని చెప్పారు రణభీర్‌కపూర్‌. తన సెంటిమెంట్స్‌ గురించి అలియాభట్‌ వివరిస్తూ ‘నాకేదైనా మంచి జరగాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన సన్నివేశాల్ని అద్దంలో అభినయించి చూసుకుంటాను. కోరుకున్నది నా చెంతన ఉన్నట్లు ఊహిస్తూ నటిస్తాను. అలా చాలా కోరికలు తీరాయి’ అని చెప్పింది. ‘లక్కీ ఛార్మ్‌' పేరుతో వీరిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Ranbir-Kapoor

484

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles