రాములో రాములా..

Mon,October 21, 2019 12:05 AM

‘సామజవరగమన....నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు...ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు..’ అంటూ ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ప్రణయగీతం సంగీతప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. మదిలోని ప్రేమానుభూతులకు దర్పణంలా ఈ పాట అందరిని మెప్పిస్తున్నది. విడుదలైన 24గంటల్లోనే ఆరు మిలియన్ల వ్యూస్‌ లభించాయి. ‘ఇప్పటివరకు ఈ పాటకు 40మిలియన్స్‌ వ్యూస్‌, ఏడు లక్షల లైక్స్‌ వచ్చాయి. తెలుగులో ఫస్ట్‌సింగల్‌కు ఈ స్థాయిలో స్పందన రావడం ఓ రికార్డు’ అని చిత్ర బృందం తెలిపింది. తమన్‌ స్వరపరచిన ఈ గీతాన్ని సిద్‌శ్రీరామ్‌ ఆలపించారు. ఇదిలావుండగా ఈ సినిమాలోని ‘రాములో రాములా..’ సాంగ్‌ప్రోమోను నేడు విడుదల చేయబోతున్నారు. పూర్తి పాటను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, రాజేంద్రప్రసాద్‌, సచిన్‌ఖేడ్‌కర్‌, తనికెళ్లభరణి, మురళీశర్మ, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీఎస్‌ వినోద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పీడీవీ ప్రసాద్‌.

1254

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles