మా ప్రపంచంలోకి సింహాకు స్వాగతం

Sat,December 7, 2019 10:46 PM

దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర టీజర్‌ను శనివారం కథానాయకుడు రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు. ‘శుభోదయం కార్యక్షికమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే అంశం అతినిద్ర యొక్క లక్షణాలు. అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతివూభమణం’ అంటూ ఓ రేడియో వ్యాఖ్యానంతో టీజర్ ఉత్కం మొదలైంది. ఆత్రుత, అసహనం, కోపం కలబోసిన భిన్న మనో సంచలనాలతో కథానాయకుడి పాత్రను ప్రతిబింబించేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.


ఈ టీజర్ గురించి రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తూ ‘మీ అన్నదమ్ములిద్దరిని అంకితభావం, నిబద్ధత, ప్రతిభకు తార్కాణంలా నిర్వచించవొచ్చు. ‘రంగస్థలం’ సమయంలో సింహాతో కలిసి పనిచేశాను. ఆ ప్రయాణం మరపురానిది. మా నటుల ప్రపంచంలోకి సింహాకు స్వాగతం పలుకుతున్నా. కాలభైరవ విలక్షణ గాత్రానికి నేను పెద్ద అభిమానిని. ఆయన స్వరాల్ని వినాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినోదం మేళవించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా కొత్త సాంకేతిక నిపుణుల్ని, నటుల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం’ అన్నారు. నరేష్ ఆగస్త, అతల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్‌పకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, స్టయిలింగ్, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

445

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles