సౌండ్ కట్ ట్రైలర్ అద్భు తంగా వుంది!


Mon,August 12, 2019 12:15 AM

ram charan lanches sharwanand ranarangam sound cut trailer

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రణరంగం. సుధీర్‌వర్మ దర్శకుడు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర సౌండ్ కట్ ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌండ్ కట్ ట్రైలర్ అద్భుతంగా, టెర్రిఫిక్‌గా వుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌లో శర్వానంద్‌ను మేము ఎలా చూడాలనుకున్నామో అలాగే వున్నాడు.థియేట్రికల్ ట్రైలర్ పర్‌ఫెక్ట్‌గా వుంది. శర్వా నటించిన కో అంటే కోటి నాకు చాలా ఇష్టం.

అలాంటి భావోద్వాగాలతో కూడిన చిత్రం మళ్లీ శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ చూశాక అలాంటి సినిమానే అనిపించింది. ఈ చిత్రంతో దర్శకుడు సుధీర్‌వర్మ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. చాలా మంచి కథతో రూపొందిన చిత్రమిది. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. ప్రశాంత్ పిైళ్లె అందించిన నేపథ్య సంగీతం బాగుంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.

530

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles