జాగ్రత్తలు అవసరం!

Thu,September 19, 2019 10:54 PM

ఫిట్‌నెస్ విషయంలో అధికశ్రద్ధ తీసుకుంటుంది పంజాబీ అమ్మడు రకుల్‌ప్రీత్‌సింగ్. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా శారీరక వ్యాయామాన్ని మాత్రం మరచిపోనని చెబుతుంటుంది. అయితే చాలామంది డైటింగ్ పేరుతో అనవసరంగా కఠిన ఆహారనియమాల్ని పాటిస్తుంటారని, వాటికి తాను వ్యతిరేకమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ స్వతహాగా నేను భోజనప్రియురాలిని. నచ్చిన ఆహారాన్ని తినేస్తా. అయితే రుచి, శుచి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటాను. మనం తినే ఆహారపదార్థాల్ని ఏ పద్ధ్దతిలో తయారుచేస్తున్నారు? ఎలాంటి పదార్థాల్ని వాడుతున్నారు? వాటిలో ఉండే పోషకవిలువలు ఏమిటి? ఈ అంశాలన్నింటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతేకాని డైటింగ్ పేరుతో జిహ్వచాపల్యాన్ని చంపుకోవడం మంచిపద్ధతి కాదు. అయితే ఎంత మోతాదులో ఆహారాన్ని తీసుకుంటున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం అని చెప్పింది. ప్రస్తుతం హిందీలో రకుల్‌ప్రీత్‌సింగ్ మర్జావన్ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.

524

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles