తల్లిదండ్రులకు సందేశం నచ్చింది!


Tue,August 20, 2019 11:41 PM

Rakshasudu Movie Press Meet Bellamkonda Sai Srinivas  Anupama

రాక్షసుడు చిత్రం మూడు వారాల్ని పూర్తిచేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఏ స్టూడియోస్ పతాకంపై తొలి ప్రయత్నంగా రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు కోనేరు సత్యనారాయణ. ఆయన నిర్మించిన చిత్రం రాక్షసుడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమపరమేశ్వరన్ జంటగా నటించారు. రమేష్‌వర్మ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని ఈ సినిమా అలరిస్తున్నది. ఆడపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సందేశాత్మకంగా చూపించిన విధానం బాగుందని అంటున్నారు. మరో రెండు వారాల వరకు వసూళ్లను సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అని అన్నారు. తొలుత ఈ సినిమాలో నటించడానికి అనుపమ పరమేశ్వరన్ ఉత్సాహాన్ని చూపలేదని, మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోవద్దని తన తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి సినిమాలో భాగమయ్యిందని రమేష్‌వర్మ చెప్పారు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ తమిళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో చిత్ర విజయోత్సవ వేడుకకు హాజరుకాలేకపోయాను. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయడం ఆనందంగా ఉంది. మంచి సినిమా కెరీర్ ఉన్నతికి ఎప్పుడూ దోహదపడుతుంది. రాక్షసుడు అలాంటి సినిమానే. ఆ ఆలోచనతోనే ఇందులో నటించాను అని చెప్పింది.

313

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles