మూడింతల వినోదం

Sun,September 15, 2019 11:08 PM

రాజుగారి గదికి మించి వినోదాన్ని పంచే చిత్రమిది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించాం అని అన్నారు ఓంకార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం రాజుగారి గది-3. అశ్విన్‌బాబు, అవికాగోర్ జంటగా నటిస్తున్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. హీరో వెంకటేష్ ఈ చిత్ర టీజర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. సాయిమాధవ్‌బుర్రా మాట్లాడుతూ అందమైన దయ్యం కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాయిగా నవ్విస్తుంది. వినోదమే లక్ష్యంగా ఓంకార్ ఈ సినిమాను రూపొందించారు అని అన్నారు. భయపెడుతూ మనస్ఫూర్తిగా నవ్వించే చిత్రమిదని ఛాయాగ్రాహకుడు ఛోటా కె నాయుడు చెప్పారు. అశ్విన్‌బాబు మాట్లాడుతూ నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించిన చిత్రమిది.


రాజుగారిగది కంటే మూడు రేట్లు ఎక్కువ నవ్వులను పంచుతుంది అని తెలిపారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత తాను నటిస్తున్న తెలుగు చిత్రమిదని, ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం లభించడంతోనే ఈ సినిమా అంగీకరించానని అవికాగోర్ చెప్పింది. రాజుగారిగది-2లో వినోదం తగ్గిందనే విమర్శలు వచ్చాయి. అందుకే కామెడీ పాళ్లు పెంచి సినిమా చేశాం. ప్రతి ఒక్కరూ సొంత సినిమాలా భావించి పనిచేశారు. దసరాకు సినిమాను విడుదల చేస్తాంఅని ఓంకార్ పేర్కొన్నారు. విఠలాచార్య మాదిరిగానే ఓంకార్ హారర్ కామెడీ సినిమాల ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారని అలీ అన్నారు.
Rajugarigadi1

313

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles