పల్లెటూరి ప్రేమకథ

Sat,November 16, 2019 12:08 AM

అప్పుడు-ఇప్పుడు టీజర్ బాగుంది. ఫీల్‌గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అని అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. సుజన్, తనిష్క్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అప్పుడు-ఇప్పుడు. ఉషారాణి కనుమూరి, విజయరామకృష్ణంరాజు నిర్మిస్తున్నారు. చలపతి పువ్వల దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను పూరి జగన్నాథ్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ రెండు ఊళ్ల మధ్య గొడవలు ఓ యువ జంట ప్రేమకు ఎలాంటి అడ్డంకులుగా నిలిచాయన్నది ఇతివృత్తం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అన్నారు.

297

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles