పరిశ్రమకు పెద్దమనిషి అవసరం ఉంది!

Sun,December 8, 2019 11:27 PM

‘సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేను సినీరంగంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇండస్ట్రీ ్ర శేయోభిలాషిగా నాకుపేరుంది. నిర్మాతగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాను. వచ్చే ఏడాది దర్శకత్వం వహించాలన్నది నా కోరిక’ అని అన్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్. నేడు ఆయన జన్మదినం. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’కు ఆయనే నిర్మాత. ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం సి.కల్యాణ్ పాత్రికేయులతో ముచ్చటించారు.


‘రూలర్’ చిత్రానికి చక్కటి వాణిజ్య అంశాలతో అద్భుతమైన కథ కుదిరింది. తెలుగునేల నుంచి ఉత్తర్‌వూపదేశ్‌కు వెళ్లి సెటిలైన వ్యక్తి కథ ఇది. తనవారి కోసం అతడు చేసిన పోరాటం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి రాజకీయాంశాలు ఉండవు. బాలకృష్ణ అభిమానులకు పండగలా ఉంటుంది. సినిమా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాను.

ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు...

ప్రస్తుతం చిత్రసీమ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొత్త నిర్మాతలు సరైన ప్రణాళిక లేకుండా సినిమాలు చేస్తూ పరాజయాల్ని కొనితెచ్చుకుంటున్నారు. అయితే నూతన నిర్మాతలు లేకుంటే పరిశ్రమ మనుగడ చాలా కష్టం. సినీ నిర్మాణంలోకి అడుగుపె పరిశ్రమ గురించి చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని వస్తే సత్ఫలితాల్ని సాధించగలుగుతారు.

పరిశ్రమను ఎవరూ శాసించలేరు..

ఇండస్ట్రీ కొందరి చేతుల్లో ఉంది..వాళ్లే శాసిస్తున్నారనడం అర్థం లేనిది. సినిమా వ్యాపారాత్మక కళ. ఇక్కడ ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. ఎవరో కొద్దిమంది పరిశ్రమను శాసించలేరు. ఇదో పెద్ద వ్యవస్థ. అందరూ సంఘటితంగా ఉన్నప్పుడే పురోగతి సాధ్యమవుతుంది. కొందరు నిర్మాతలు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రొడ్యూసర్ గిల్డ్‌ను.పొడ్యూసర్ కౌన్సిల్‌లో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో గిల్డ్ ఉండదు. అయితే ఆ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. భవిష్యత్తులో నిర్మాతలకు సంబంధించిన ఏ అసోసియేషన్‌లోనైనా రెగ్యులర్‌గా సినిమాలు తీసేవారికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని అనుకుంటున్నాం.

అలాంటి వ్యక్తి కావాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమకు దిశానిర్ధేశం చేయడానికి ఓ పెద్దమనిషి అవసరం ఉంది. దాసరి నారాయణరావు దివంగతులైన తర్వాత ఆయన లేని లోటును తీర్చేవారు లేకుండా పోయారు. ఓసారి చిరంజీవిని కలిసినప్పుడు ఆయన్ని లీడ్ తీసుకోమని చెప్పాను. చిరంజీవి పరిశ్రమ బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకొని ఓ దిక్సూచిలా నిలవాలని కోరుకుంటున్నాను. ఆయన మార్గదర్శనంలో పరిశ్రమ బాగుపడుతుందని నమ్ముతున్నా. చిరంజీవి తప్పకుండా పరిశ్రమ పెద్దగా బాధ్యతను తీసుకుంటారని ఆశిస్తున్నా.

536

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles