నేటి యువత కథ

Sun,November 17, 2019 12:05 AM

సాయిరోనక్, ప్రీతి అర్సాని జంటగా నటిస్తున్న చిత్రం ప్రెషర్ కుక్కర్. దర్శకద్వయం సుజోయ్, సుశీల్ రూపొందిస్తున్నారు. కరంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై సుజోయ్, సుశీల్, అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6న ప్రేక్షకులముందుకురానుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. సినిమా కథ నచ్చడంతో దర్శకుడు తరుణ్‌భాస్కర్ టీజర్‌ను కట్ చేసి రిలీజ్ చేశారు. తమ అభీష్టాలకు భిన్నంగా తల్లిదండ్రుల ఆకాంక్షలు ఉండటం వల్ల నేటి యువత ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కుంటున్నారనే అంశాల్ని ఈ సినిమాలో చర్చిస్తున్నాం. టీజర్‌కు మంచి స్పందన లభించింది అని చిత్రబృందం తెలిపింది. రాహుల్ రామకృష్ణ, రజయ్ రోవాన్, తనికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్, అనిత్ మాడాడి, సంగీతం: సునీల్‌కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్, రచన-దర్శకత్వం: సుజోయ్, సుశీల్.

228

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles