ప్రేమ పయనంలో..

Mon,October 21, 2019 12:04 AM

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’. జీపీఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ నాయకానాయికలుగా నటిస్తున్నారు. మురళీరామస్వామి (ఎమ్‌ఆర్‌) దర్శకుడు. పి.ఎస్‌.రామకృష్ణ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను శనివారం విడుదల చేశారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నిర్మాతగా తొలి చిత్రమిది. ప్రేమ ప్రయాణంలోని అందమైన అనుభూతులకు అద్దం పడుతుంది. త్వరలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ‘ప్రతి మనిషిలో మరో కోణం ఉంటుంది. అదే మా సినిమా కథ. వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. లవ్‌, రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ కలబోతగా మెప్పిస్తుంది’ అని దర్శకుడు చెప్పారు. విభిన్న కథా చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని నాయకానాయికలు పేర్కొన్నారు. జ్యోతిరాజ్‌పుత్‌, మమతశ్రీచౌదరి, అంకిత, సంజనచౌదరి, సుమన్‌, భార్గవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరుమల రోడ్రిగ్జ్‌, సంగీతం: ఆర్స్‌, పాటలు: సురేష్‌ ఉపాధ్యాయ, అలరాజు, రచన-దర్శకత్వం: మురళీరామస్వామి (ఎమ్‌.ఆర్‌).

645

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles