రమేష్‌ప్రసాద్‌కు సతీవియోగం

Fri,October 18, 2019 12:07 AM

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ అక్కినేని రమేష్‌ప్రసాద్ సతీమణి విజయలక్ష్మి (77) గురువారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రమేష్‌ప్రసాద్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. విజయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో గురువారం సాయంత్రం ఆమె అంత్యక్రియల్ని నిర్వహించారు.


318

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles