‘మనోవిరాగి’ ప్రస్థానం

Tue,September 17, 2019 11:31 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ‘మన్‌బైరాగి’ పేరుతో ఓ సినిమా రాబోతున్నది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత సంజయ్‌లీలాభన్సాల్సీ నిర్మించనున్నారు. సంజయ్‌త్రిపాఠి దర్శకత్వం వహిస్తారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు ‘మనోవిరాగి’ అనే పేరును ఖరారు చేశారు. మంగళవారం నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఫస్ట్‌లుక్‌ను కథానాయకుడు ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేశారు. ‘ప్రధాని గురించి మనకు తెలియని కథ ఇది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అని ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘ఈ సినిమా కోసం ఎంతో పరిశోధన చేశాం. ప్రధాని యువకుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ప్రతి ఒక్కరికి స్ఫూర్తివంతంగా ఉంటుంది’ అని సంజయ్‌లీలాభన్సాలీ చెప్పారు.

392

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles