సాహో 424కోట్లు

Sat,September 14, 2019 12:32 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 424కోట్లు వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘విడుదలైన తొలిరోజు నుంచే భారీ కలెక్షన్స్‌ రాబడుతున్నది. అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ప్రభాస్‌ వాణిజ్య సత్తా ఏమిటో ఈ సినిమా నిరూపించింది. పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టిస్తున్నది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించింది.

1423

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles