‘నిను వీడని నీడను నేనే’ పక్కా హిట్‌!


Thu,July 11, 2019 11:30 PM

Prabhas buys first ticket of Sundeep Kishan Friday release

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నినువీడని నీడను నేనే’. కార్తీక్‌రాజు దర్శకుడు. అన్యాసింగ్‌ కథానాయిక. దయా పన్నెం, సందీప్‌కిషన్‌, వీజీ సుబ్రహ్మణ్యన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ‘సినిమా ఫంక్షన్‌లో నేను ఎప్పుడూ మంచి సినిమా తీశానని చెబుతుంటా కానీ అదిరిపోయే సినిమా తీశానని తొలిసారి చెబుతున్నా. పక్కా హిట్‌ అయ్యే సినిమా తీశా. అది నేనొక్కడినే తీశానని చెప్పడం లేదు. సెట్‌లో, టీమ్‌కు ఎలాంటి లోటు చేయలేదు. ఇవాళ్టి వరకు ఒక్కరూపాయి కూడా మోసం చేయలేదు. మంచి సినిమా తీశాం. సినిమానే మాట్లాడుతుంది. నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఉదయం వరకు సినిమా విడుదల అవుతుందో? లేదో మాకు తెలియదు. అంత టెన్షన్‌ పడ్డాను. నాకు తెలిసింది ఒక్కటే కథను నమ్మాలి.

కరెక్ట్‌గా ప్రచారం చేయాలి. జనాల్లోకి తీసుకెళ్లాలి. ఒకడు సినిమా తీస్తున్నాడంటే సంబంధం లేనివాడు దాన్ని ఆపడానికి చూస్తుంటాడు. అందరికన్నా సినిమా గొప్పది. అదే సినిమాను కాపాడుకుంటుంది. ఈ చిత్రానికి చాలా అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటిని అధిగమించాం. శివ, సీతారామ్‌ లేకపోతే నేను లేను. ఈ చిత్రాన్ని ఇంత వరకు తీసుకొచ్చింది వాళ్లే. ‘ఎస్‌ఎమ్‌ఎస్‌' చిత్రానికి సుధీర్‌బాబు 77 మంది దగ్గర అప్పుఎలా చేశాడో ఇప్పుడ అర్థమైంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు, నిఖిల్‌, కార్తికేయ, కార్తీక్‌రాజు, దయా పన్నెం, విశ్వక్‌సేన్‌, అన్యాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

678

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles