అఖిల్‌తో జోడీగా..

Sat,September 14, 2019 11:27 PM

మంగళూరు సోయగం పూజాహెగ్డేను అదృష్ట నాయిక అంటూ అభివర్ణిస్తున్నారు తెలుగు సినీ జనాలు. ఏడాదికాలంగా ఈ అమ్మడు భారీ ఆఫర్లతో దూసుకుపోతున్నది. తాజాగా ఈ పొడగరి అక్కినేని అఖిల్‌తో జోడీకట్టడానికి సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే...బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌కు మంచి పేరుంది. ఈ సినిమా కూడా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుంది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. అఖిల్‌ను మునుపెన్నడూ లేనివిధంగా కొత్తపంథాలో ఆవిష్కరిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.మణికందన్‌, సంగీతం: గోపీసుందర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాస్కర్‌.

533

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles