పోలీస్ ఝాన్సీ


Wed,August 7, 2019 12:03 AM

Police Patas Movie Trailer Launch Ayesha Habib C Kalyan

అయేషా హబీబ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోలీస్ పటాస్. శశికాంత్ దర్శకత్వం వహించారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయశాంతి తర్వాత యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్ల సంఖ్య తగ్గిపోయింది. రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఆ లోటును అయేషా తీరుస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ ఝాన్సీ అనే మహిళా ఐపీఎస్ అధికారి కథ ఇది. సంఘవిద్రోహ శక్తులపై ఆమె సాగించిన పోరాటం నేపథ్యంలో ఆసక్తికరంగా ఉంటుంది అని అన్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా తాను యాక్షన్ సన్నివేశాల్లో నటించానని అయేషా హబీబ్ చెప్పింది.

259

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles