అసలైన పండగ సినిమా!

Mon,October 7, 2019 12:14 AM

మంచి సినిమాల్ని సినీ పెద్దలు ప్రోత్సహించాలి. సరైన సంఖ్యలో థియేటర్లు కేటాయించాలి అని అన్నారు నిర్మాత శ్రీహరి మంగళంపల్లి. రమ్యగోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డిలతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. నవీన్‌విజయ్‌కృష్ణ, అవసరాల శ్రీనివాస్, సోఫియాసింగ్, మేఘాచౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. బాలాజీ సానల దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాతలు మాట్లాడుతూ పండగ సమయంలో పెద్ద సినిమాల పోటీ మధ్య విడుదల చేయోద్దని చాలా మంది భయపెట్టారు. అంతిమంగా సినిమాకు పాజిటివ్‌టాక్ రావడం ఆనందంగా ఉంది. అసలైన పండుగ సినిమా ఇదని, కుటుంబమంతా కలిసి చూసేలా ఉందంటున్నారు. విలువలతో కూడిన మరిన్ని మంచి చిత్రాల్ని నిర్మించడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. థియేటర్ల కొరత వల్ల మల్టీఫ్లెక్స్‌లలో ఎక్కువగా విడుదలచేయలేకపోయాం. త్వరలో థియేటర్ల సంఖ్య పెరగనుంది అని తెలిపారు. నవీన్‌విజయ్‌కృష్ణ మాట్లాడుతూ నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నమిది. కథ బాగుంటే లాజిక్‌లతో సంబంధం ఉండదని నిరూపించింది.ద్వితీయార్థంతో పాటు పతాక ఘట్టాలు అలరిస్తున్నాయని చెబుతున్నారు అని పేర్కొన్నారు. పల్లెటూరి సంస్కృతి సంప్రదాయాల్ని అర్థవంతంగా చూపించిన చిత్రమిదని అందరూ అంటున్నారని దర్శకుడు పేర్కొన్నారు.

497

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles