స్కామ్ నేపథ్యంలో..

Mon,December 2, 2019 11:03 PM

చెంగ్, మైరా అమితి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓన్లీ నేను’. విఘ్నేష్ కలగర దర్శకుడు. శ్రీనివాస్ శరకడం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో నటుడు కాశీవిశ్వనాథ్ విడుదలచేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భాషా సాంస్కక్షుతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ‘ట్రైలర్ బాగుంది. వినూత్నమైన పాయింట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఓటమి ఎరగని మైరా అనే యువతి కథ ఇది. ఆమె జీవితగమనంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఓ స్కామ్ ప్రధానంగా ఊహకందని మలుపులతో ఉత్కం ఉంటుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 15న మా సంస్థ ద్వారా హైదరాబాద్‌లో ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నాం. ప్రతిభ ఉండి అవకాశాలు లేని వారికి చక్కటి వేదికగా ఈ కార్యక్షికమం ఉపయోగపడుతుంది’ అని తెలిపారు. ఈ కార్యక్షికమంలో విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

260

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles