యువ హీరోలకు శర్వా ఆదర్శం!


Thu,August 15, 2019 12:15 AM

Nithin Sensational Comments On Sharwanand At Ranarangam Movie Pre Release Event

యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరి ప్రోత్సాహం లేకపోయినా హీరోగా అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు అన్నారు నితిన్. శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం రణరంగం. సుధీర్‌వర్మ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో సుధీర్‌వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా చూసిన వారంతా బాగుందని అంటున్నారు. ప్రేక్షకులు అదే అనుభూతికి లోనవుతారనే నమ్మకం ఉంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌వర్మ, కల్యాణి ప్రియదర్శన్, సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

267

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles