నిశ్శబ్దం మూకీ కాదు!

Mon,December 2, 2019 11:03 PM

‘‘నిశ్శబ్దం’ చిత్రాన్ని మూకీ సినిమాగా అపోహపడుతున్నారు. అది అవాస్తవం. ఓ మూగ, చెవిటి యువతి కథ ఇది. హీరోహీరోయిన్లు కాకుండా తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయి’ అని అన్నారు కోన వెంకట్. టీజీ విశ్వవూపసాద్‌తో కలిసి ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకుడు. జనవరి 31న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ ‘రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. హేమంత్‌మధుకర్ చెప్పిన కథ వినగానే అద్భుతమైన సినిమా అవుతుందనిపించింది. ఈ జర్నీలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. తొలుత వేరే హీరోయిన్‌తో ఈ సినిమా చేయాలనుకున్నాం. అనుకోకుండా ఆమె డేట్స్ సర్ధుబాటు కాలేదు. అదే సమయంలో విమానవూపయాణంలో అనుష్కను కలిస్తే ఆమెకు కథ వినిపించాను. అనుష్కతో పాటుచాలా మంది నటీనటులు ఒకరిని అనుకొని మరొకరితో సినిమా చేశాం.


పూర్తిస్థాయిలో అమెరికాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా కోసం పనిచేశారు. యజ్ఞంలా భావించి ఈ సినిమా చేశాం. స్క్రీన్‌ప్లేపరంగా నా కెరీర్‌లో ఛాలెంజింగ్ సినిమా ఇది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రూపొందించాం. మలయాళం, హిందీ భాషల్లో అనువదిస్తున్నాం. ఆ తర్వాత ఇంగ్లీష్‌లో విడుదలచేస్తాం’ అని తెలిపారు. హేమంత్ మధుకర్ మాట్లాడుతూ ‘కోన వెంకట్‌కు కథ చెప్పగానే రెగ్యులర్ సినిమాలా కాకుండా హాలీవుడ్ స్థాయిలో చేద్దామన్నారు. థ్రిల్లర్ కథాంశమిది. కథపై నమ్మకంతోఅనుష్క ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు సంజ్ఞలకు సంబంధించిన మెళకువలతో పాటు పెయింటింగ్ నేర్చుకున్నారు. ఈ సినిమాలో అంజలి పోలీస్‌గా కనిపిస్తుంది’ అని తెలిపారు. విశ్వవూపసాద్ మాట్లాడుతూ ‘‘నిన్నుకోరి’ సినిమా ద్వారా కోన నా ప్రయాణం ప్రారంభమైంది. హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా చేయాలనే సంకల్పంతో చిత్రాన్ని నిర్మించాం’ అన్నారు. సినిమాలో వైల్డ్‌లైఫ్ ఫొటోక్షిగాఫర్‌గా తన పాత్ర సాగుతుందని సుబ్బరాజు అన్నారు. వందన, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

240

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles