స్వచ్ఛమైన ప్రేమకథ


Tue,August 20, 2019 11:36 PM

Ninnu Talachi Movie Press Meet  Vamsi Yakasiri  Stefy Patel  Anil Thota

వంశీ, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం నిన్ను తలచి. అనిల్ తోట దర్శకత్వం వహిస్తున్నారు. ఓబులేష్, నేదురుమల్లి అజిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ నిజాయితీతో ఈ సినిమా చేశాం. అభి, అంకిత అనే జంట కథ ఇది. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ అందమైన ప్రేమకథ ఇది. అనుకున్న బడ్జెట్‌లో పక్కా ప్లానింగ్‌తో సినిమా పూర్తిచేశాం. విడుదలైన నాలుగు పాటలు, టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది అని చెప్పారు. ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ఇదని, కథాబలమున్న మంచి సినిమాతో హీరోగా తెలుగు చిత్రసీమకు పరిచయం కానుండటం అదృష్టంగా భావిస్తున్నానని వంశీ అన్నారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని మిగిల్చిన సినిమా ఇదని హీరోయిన్ స్టెఫీపటేల్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఏలెందర్ మహవీర్, కృష్ణతేజ, కేదార్‌శంకర్ తదితరులు పాల్గొన్నారు.

198

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles