అందుకే మీడియాకు దూరం!

Mon,October 7, 2019 12:38 AM

సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం తమ విధిగా భావిస్తారు మెజారిటీ తారలు. అతికొద్ది మంది మాత్రమే వాటికి దూరంగా ఉంటారు. దక్షిణాది అగ్రనాయిక నయనతార సినిమా ప్రమోషన్‌లకు హాజరుకాదు. పదేళ్ల నుంచి ఈ అమ్మడు సినిమాలకు సంబంధించిన ఏ ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. తాజాగా నయనతార ఓ మాస పత్రిక ముఖచిత్రంపై దర్శనమివ్వడమే కాకుండా ఇంటర్వ్యూ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది. పదేళ్ల తర్వాత తాను మీడియాతో ముచ్చటించానని పేర్కొంది నయనతార. ఆమె మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా గోప్యత పాటిస్తాను. నేనేం ఆలోచిస్తున్నానో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదనుకుంటాను. జన సమూహాల్లోకి వెళ్లడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. గతంలో నా వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లను ప్రచారం చేశారు. అలాంటి ఒత్తిళ్లను నేను తట్టుకోలేను. అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నా. నటించడం నా వృత్తి. నా సినిమాలే నేనేమిటో తెలిచెబుతాయి అని తెలిపింది. ఇటీవల విడుదలైన సైరా చిత్రంలో చిరంజీవి సతీమణి పాత్రలో నయనతార కనిపించిన విషయం తెలిసిందే.

1417

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles