గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!


Sat,August 10, 2019 11:59 PM

Much Awaited Saaho Trailer Released Prabhas Shraddha Kapoor

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్. ఆ సినిమా తరువాత ఆయన నుంచి వస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత భారీగా తెరకెక్కించారు. యువీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. రెండు వేల కోట్ల బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనుందని తెలుస్తోంది. అండర్‌కవర్ కాప్‌గా ప్రభాస్ కనిపించబోతున్నారు.

ఆయన పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అత్యంత ైస్టెలిష్‌గా సాగనుంది. ఫీల్‌గుడ్ సినిమాకు ముందొచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు..కంటెంట్ కరెక్ట్‌గా వున్నా విజువల్ చాలా డిస్ట్రబింగ్‌గా వుంటుంది.. అంటూ ప్రభాస్ పాత్ర ఇంట్రడక్షన్‌ని మురళీశర్మ వివరిస్తున్న తీరు... వైలెన్స్ ఎక్కువైపోయింది రొమాన్స్ కావాలి.. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ వుంటది.. అంటూ ట్రైలర్‌లో ప్రభాస్ చెబుతున్న డైలాగ్‌లు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకునేలా వున్నాయి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న విడుదలకానుంది.

964

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles