మెగా మల్టీస్టారర్

Thu,November 7, 2019 11:43 PM

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించబోతున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనుందని ప్రచారం జరుగుతున్నది. మరో విశేషమేమిటంటే..ఈ సినిమాలో రామ్‌చరణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలొచ్చాయి. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రామ్‌చరణ్ ఫుల్‌లెంగ్త్ రోల్‌ను పోషించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని అంటున్నారు. అయితే ఇందులో ఒకరోల్‌ను రామ్‌చరణ్ పోషిస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రకటించాల్సి ఉంది. రామ్‌చరణ్ నటించిన మగధీర బ్రూస్‌లీ చిత్రాల్లో చిరంజీవి అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు తెరమీద సందడిచేయనుండటంతో మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య ఇతివృత్తానికి సామాజికాంశాల్ని మేళవించి దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

2394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles