దర్శకులు ఒంటరివారు!

Sun,December 8, 2019 11:10 PM

సినిమా దర్శకత్వం చాలా కష్టమైన వ్యవహారమని వ్యాఖ్యానించారు బాలీవుడ్‌ అగ్రహీరో షారుఖ్‌ఖాన్‌. ఒకవేళ తాను దర్శకత్వం వహిస్తే ఒంటరివాడినయ్యాననే భావన కలుగుతుందని చెప్పారు. ‘దర్శకత్వం అన్నది సృజన, శ్రమతో కూడుకున్న జాబ్‌. స్క్రిప్ట్‌, సంభాషణలు రాసుకోవాలి. నటుల నుంచి కావాల్సిన పర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవాలి. షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఎడిటింగ్‌ రూమ్‌లో రాత్రిళ్లు కసరత్తులు చేయాలి. తీరా సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ఒంటరిగా మిగిలిపోతాడు. అందుకే నేను దర్శకత్వ బాధ్యతను ఎప్పుడూ తీసుకోను’ అని షారుఖ్‌ పేర్కొన్నారు.


265

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles