అవార్డులు వస్తాయంటున్నారు!

Sun,September 15, 2019 11:06 PM

మహాత్మ, ఖడ్గం తర్వాత వైవిధ్యమైన పాత్రలో నేను నటించిన చిత్రమిది. నా పాత్రతో పాటు సినిమా బాగుందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. అవార్డులు వస్తాయని చెబుతుండటం ఆనందాన్నిస్తున్నది అని అన్నారు శ్రీకాంత్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్షల్. అభయ్ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. జైరాజాసింగ్ దర్శకుడు. మేఘాచౌదరి కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుక నిర్వహించింది. శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నేను చేసిన మంచి సినిమా ఇది. రాజాసింగ్ వినూత్నమైన పాయింట్‌తో అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు అని తెలిపారు. అభయ్ మాట్లాడుతూ తొలిరోజు ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. మౌత్‌టాక్‌తో రెండో రోజు నుంచి పెరిగాయి. శ్రీకాంత్ పాత్రకు చక్కటి స్పందన లభిస్తున్నది. హీరోగానే కాకుండా నిర్మాతగా నాకు సంతృప్తిని మిగిల్చిన చిత్రమిది. కొత్త ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది అని అన్నారు. తన పాత్రకు చక్కటి స్పందన లభిస్తున్నదని మేఘా చౌదరి చెప్పింది. శ్రీకాంత్ వల్లే పెద్ద విజయం సాధ్యమైంది. అభయ్‌పై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి అని దర్శకుడు పేర్కొన్నారు.

289

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles