ప్రేమికుల మథనం


Tue,July 23, 2019 01:39 AM

Madhanam Movie Official Teaser released

శ్రీనివాస్ సాయి, భావనరావు జంటగా నటిస్తున్న చిత్రం మథనం. అజయ్‌సాయి మనికందన్ దర్శకుడు. దివ్యాప్రసాద్, అశోక్‌ప్రసాద్ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి, దీప దంపతులు ఆవిష్కరించారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చిత్ర నిర్మాత అశోక్‌తో నాకు పదిహేనేళ్ల నుంచి స్నేహం ఉంది. తనకు సినిమా పరిశ్రమపై మంచిపట్టుంది. యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. సురేందర్‌రెడ్డి నాకు గురువులాంటివారు. ఆయన దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నా.

ఒక ఐడియా, సీన్ విని నిర్మాత నాతో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. రామ్ అనే యువకుడి కథ ఇది. ప్రేమప్రయాణంలో అతని మథనం ఏమిటన్నది హృదయాల్ని స్పృశిస్తుంది అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా తర్వాత అందరూ తనను మథనం సాయి అని పిలుస్తారని, అంతలా చిత్ర కథాంశం ఆకట్టుకుందని హీరో శ్రీనివాస్‌సాయి చెప్పారు. కథానుగుణంగా చక్కటి స్వరాలతో నాలుగు పాటలు కుదిరాయని గీత రచయిత పూర్ణాచారి పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: రాన్‌యెతాన్ యోహాన్.

274

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles