తెలుగులో సెలబ్రిటీ బెడ్‌స్టోరీస్

Tue,September 17, 2019 12:09 AM

సినీ తారల తెరవెనక జీవితం, సెలబ్రిటీస్ వ్యక్తిగత విషయాల పట్ల ప్రతి ఒక్కరిలో ఉత్సుకత ఉంటుంది. ముఖ్యంగా వారి నైట్‌లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రదర్శిస్తారు. అలాంటి వారికోసం బాలీవుడ్‌లో ఫీట్ అప్ విత్‌స్టార్స్ పేరుతో ఓ షో వస్తున్నది. బెడ్ టైమ్ స్టోరీస్ లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూగా ఈ షోను పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ షో తెలుగులో రాబోతున్నది. దీనికి మంచు లక్ష్మి ప్రయోక్తగా వ్యవహరించబోతున్నది. ఈ షో గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ నిర్వహించబోతున్నందుకు ఆనందంగా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ మనోభావాల్ని, రహస్యాల్ని తెలుసుకునేందుకు ఇది మంచి వేదిక. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా మలిచేందుకు ప్రయత్నిస్తా అని చెప్పింది. ఈ నెల 23 నుంచి ఈ షో ప్రసారం కానుంది.

1020

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles