సంపూర్ణ వినోదం

Sat,September 14, 2019 11:26 PM

కె.ఆర్‌.ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌'. గీతాంజలి, హనీ, నందిని, భాను, హర్ష, మధు, ఆనంద్‌, మహేష్‌ ప్రధాన పాత్రధారులు. సాయిరామ్‌ దాసరి దర్శకత్వం వహించారు. రమేష్‌ కావలి నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సంపూర్ణ హాస్యరసభరిత చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. షకీలా తమిళ హక్కుల్ని తీసుకొని అక్కడ విడుదల చేస్తున్నారు. యువత మెచ్చే చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే చిత్రమిది. నాకు బాగా నచ్చింది. అందుకే తమిళంలో విడుదల చేస్తున్నా’ అని షకీలా చెప్పింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, థ్రిల్లింగ్‌ అంశాలున్న సినిమా ఇదని నిర్మాత తెలిపారు.

448

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles