పూరి ఆఫర్ వదులుకున్నాను!


Thu,August 8, 2019 12:24 AM

kobbari matta movie release on 10 august

సిద్ధిపేటలోని మారుమూల గ్రామంలో పుట్టిన నాకు ఈ స్థాయిలో తొలి సినిమాకే క్రేజ్ ఏర్పడుతుందని ఊహించలేదు. ఆ క్రేజ్‌ని నేను క్యాష్ చేసుకున్నానా లేదా అనే విషయంలో ఇంకా నాకు స్పష్టత రాలేదు అన్నారు సంపూర్ణేష్‌బాబు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కొబ్బరిమట్ట. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం సంపూర్ణేష్‌బాబు హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఈ సినిమా కోసం గత మూడేళ్లుగా వర్క్ చేస్తున్నాం. నా తొలి చిత్రం హృదయకాలేయం విడుదలైన తరువాత కొబ్బరిమట్ట పోస్టర్‌ని రిలీజ్ చేశాం. తొలిసారి ఈ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా మూడు పాత్రల్లో నటించాను.

ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కువగా వుండటం, చిత్రీకరణ రోజులు పెరగడం వంటి కారణాలతో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది. దాంతో సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మూడున్నర నిమిషాల డైలాగ్‌కు మంచి పేరొచ్చింది. ఈ వీడియో చూసిన మోహన్‌బాబుగారు ఫోన్ చేసి డైలాగ్ అద్భుతంగా చెప్పావు. ఆ శిరిడీ సాయినాథుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ వుంటాయని అభినందించారు. రాజేష్ నన్ను నిలబెట్టడం కోసం చేసిన సినిమా ఇది. నటుడిగా ఈ చిత్రం నా భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్న నమ్మకంతో వున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి ఆఫర్ ఇచ్చినా వదులుకున్నాను. సినిమాపై వున్న నమ్మకంతో మరో చిత్రాన్ని అంగీకరించకుండా ఈ చిత్రం కోసమే పనిచేశాను అన్నారు.

2753

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles