పెంగ్విన్ ప్రయోగం

Fri,October 18, 2019 12:41 AM

మహానటి అద్వితీయ విజయం తర్వాత మహిళా ప్రధాన కథాంశాలు, వైవిధ్యతతో కూడిన కమర్షియల్ సినిమాలకు ప్రాముఖ్యతనిస్తున్నది కీర్తిసురేశ్. తాజాగా ఆమె మరో ప్రయోగానికి సిద్ధమైంది. ద్విభాషా చిత్రంలో గర్భవతి పాత్రలో కనిపించబోతున్నది కీర్తిసురేశ్. ఆమె కథానాయికగా పెంగ్విన్ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టోన్ బేంచ్ ఫిల్మ్స్ పతాకంపై దర్శకుడు కార్తిక్‌సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె ఫస్ట్‌లుక్‌ను గురువారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో గర్భవతిగా ఆమె కనిపిస్తుంది. చీకటిలో పర్వతాల మధ్య ముఖం కనిపించకుండా వినూత్నంగా ఆమె లుక్‌ను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక పంథాలో ఛాలెంజింగ్‌గా కీర్తిసురేశ్ పాత్ర ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. దూకుడుతనం, సాత్వికత. ఆధునికత కలిగిన అపురూపమైన ఓ యువతి కథ ఇది అంటూ ట్విట్టర్ ద్వారా కీర్తిసురేశ్ తన పాత్ర గురించి పేర్కొన్నది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలకానుంది.

484

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles