కళాకారుడి ప్రేమాయణం

Sat,November 16, 2019 12:07 AM

శ్రీధర్, దుర్గ జంటగా నటిస్తున్న చిత్రం కళాకారుడు. కిరణ్ దుస్సా దర్శకుడు. శ్రీధర్ శ్రీమంతుల నిర్మాత. ట్రైలర్‌ను చిత్రబృందం బుధవారం హైదరాబాద్‌లో విడుదలచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. జీవితంలో సులువుగా డబ్బు సంపాదించాలని భావించిన ఓ యువకుడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా మెప్పిస్తుంది. అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. పాటలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ సొంత సినిమాలా భావించి పనిచేశారని, సెన్సార్ పూర్తిచేసి త్వరలో సినిమాను విడుదలచేస్తామని నిర్మాత పేర్కొన్నారు. కథ నచ్చి తాను చేసిన సినిమా ఇదని, అభినయప్రధానంగా తన పాత్ర సాగుతుందని దుర్గ చెప్పింది. ఈ కార్యక్రమంలో రవివర్మ, రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.

212

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles