కొత్త పాఠాలు నేర్చుకున్నా!

Thu,November 7, 2019 11:39 PM

జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనల్ని మనం మరింతగా ప్రేమించుకోవడమే ఉత్తమమైన మార్గమని చెబుతున్నది గోవా భామ ఇలియానా. బ్రిటీష్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్‌తో ఈ అమ్మడి ప్రేమాయణం అర్థాంతరంగా ముగిసిపోయింది. తామిద్దరం పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోయామని చెప్పింది ఇలియానా. విఫల ప్రేమ కొద్దిరోజులు బాధించడంతో ఓ థెరపిస్ట్‌ను కలిసానని, జీవితాన్ని యథాతథంగా స్వీకరించమని ఆమె చెప్పిన మాటలు తనలో స్ఫూర్తినింపాయని చెప్పుకొచ్చింది. ప్రేమలో పడటం గొప్ప భావనగా అనిపిస్తుంది. కానీ ఓ బంధాన్ని కాపాడుకోవడం విషయంలో జీవితం పరీక్ష పెడుతుంది. ఏదిఏమైనా ప్రయాణాన్ని మాత్రం కొనసాగించాల్సిందే. ఆత్మవివేచనను మించిన ఔషదం మరొకటి లేదు. విఫల ప్రేమ ఎన్నో పాఠాల్ని నేర్పింది. ఇప్పుడు జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూస్తున్నాను. మునుపటి కంటే వ్యక్తిగా మరింత పరిణితితో ఆలోచిస్తున్నాను అని పేర్కొంది ఇలియానా. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో పాగల్‌పంటీ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. తెలుగులో గత ఏడాది అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో పునరాగమనం చేసింది ఇలియానా.

436

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles