నటనను వరంలా భావిస్తా!

Sat,December 7, 2019 10:47 PM

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో యవతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు యువహీరో కార్తికేయ. కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. ఆయన కథానాయకుడి నటించిన తాజా చిత్రం ‘90ఎం.ఎల్’. శేఖర్‌డ్డి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా కార్తికేయ శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..


థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్‌ను లక్షంగా చేసుకొని ఈ సినిమా తీశాం. వారిని మెప్పించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన జోనర్. మాస్, యాక్షన్, వినోదం అంశాల కలబోతగా నా పాత్రను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నది. పోరాటఘట్టాలు, నృత్యాల్లో నా పర్‌ఫ్మాన్స్ బాగుందని అందరూ చెబుతున్నారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో డ్యాన్స్‌కు ఎక్కువగా స్కోప్ దొరకలేదు. కానీ ఈ సినిమాలో నృత్యాలపరంగా నా ప్రతిభను కనబరిచే అవకాశం దక్కింది.

ప్రతి సినిమా ఓ కొత్త అనుభవం..

నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కథాపరంగా వైవిధ్యం ఉన్నవే. జయాపజయాల్ని పక్కనపెడితే ఓ నటుడిగా ప్రతి సినిమాకు పరిణితి సాధిస్తున్నానని సంతృప్తిగా ఫీలవుతున్నాను. ఎలాంటి కథ తీసుకెళ్లినా కార్తికేయ దానికి న్యాయం చేయగలడనే విశ్వాసాన్ని పొందడమే లక్షంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాను. ‘ఆర్.ఎక్స్100’తో వచ్చిన ఇమేజ్ విభిన్న కథాంశాల్ని ఎంచుకోవడానికి దోహదపడింది. ఒకవేళ ఆ సినిమా చేసుండకపోతే ‘90ఎం.ఎల్’ వంటి డిఫంట్ కాన్సెప్ట్ మూవీస్ నా దగ్గరకు వచ్చేవి కావు.

క్రమంగా ఎదగాలన్నదే నా కోరిక..

నటనను నేను ఓ వరంలా భావిస్తాను. ఏ థియేటర్లలో అయితే ఓ సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూశానో ఇప్పుడు అక్కడే నన్ను నేను తెరపై చూసుకోవడం గొప్ప అనుభూతినిస్తున్నది. ప్రేక్షకుల కేరింతలు, విజిల్స్ చూసి థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్ష్యానికి చేరువైతేనే నటుడిగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకోవచ్చన్నది నా అభిమతం. నటన నేను ఎంతగానో ప్రేమించే కళ. ఎలాంటి పాత్ర దక్కినా దానికి న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తా. జయాపజయాల విషయంలో ఎవరిని నిందించను.

విలన్‌గా చేయడానికి సిద్ధమే..

‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో విలన్‌గా నటించా. అందులో నా పాత్రకు ప్రశంసలు లభించాయి. భవిష్యత్తులో కూడా ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధమే. అయితే నా క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనం ఉండాలి. హీరో చేతిలో దెబ్బలు తినడానికే డిజైన్ చేసిన విలన్ పాత్రలు మాత్రం చేయను. ప్రస్తుతం కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి యాక్షన్ థ్రిల్లర్, మరొకటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీ. ఈ సినిమాలకు సంబంధించిన వివరాల్ని త్వరలో వెల్లడిస్తా.

424

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles