మ్యూజికల్ హారర్


Sat,August 10, 2019 11:58 PM

Heja teaser released

మిస్టర్ 7,చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మున్నాకాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం హేజా. ఎ మ్యూజికల్ హారర్ అనేది ఉపశీర్షిక. వీఎన్‌వీ క్రియేషన్స్ పతాకంపై కేవీఎస్‌ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం విశేషాలను మున్నా కాశీ తెలియజేస్తూ మ్యూజికల్ హారర్‌గా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. సంగీతంతో పాటు నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ముమైత్‌ఖాన్ ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తారు. తప్పకుండా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా వుండే చిత్రమిది. సాంకేతికంగా కూడా ఎంతో అత్యున్నతంగా ఉంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. నూతననాయిడు, లక్ష్మన్, లిజిగోపాల్, ప్రీతం నిగమ్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వి.ఎన్.వోలెటి. ఎడిటర్: గ్యారీ బిహెచ్.

330

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles