రాజ్‌తరుణ్‌తో నాలుగోసారి..

Sat,November 16, 2019 12:10 AM

కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం, అంధగాడు చిత్రాల్లో జంటగా నటించారు రాజ్‌తరుణ్, హెభాపటేల్. తాజాగా వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్నది. రాజ్‌తరుణ్, మాళవికానాయర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హెభాపటేల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ఆమె చిత్రీకరణలో భాగమయ్యారు. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. కథానాయికతో సమానంగా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో హెభాపటేల్ కనిపిస్తుంది. కథ నచ్చి ఆమె ఈ సినిమాను అంగీకరించారు అని చిత్రబృందం తెలిపింది. వాణీవిశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ఆండ్రూ ఐ.

2562

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles