ఎల్సా మా ఫేవరేట్!

Sun,November 17, 2019 12:05 AM

డిస్నీ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ఫ్రోజెన్-2. 2013లో వచ్చిన ఫ్రోజెన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించారు. ఈ సినిమాలోని కీలకమైన ఎల్సా పాత్రకు కథానాయిక నిత్యామీనన్, మహేష్‌బాబు గారాల తనయ సితార తెలుగులో డబ్బింగ్ అందించారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిస్నీ ఇండియా ప్రతినిధి విక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ ఈ సినిమాలోని ఎల్సా పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు స్ఫూర్తివంతంగా నిలిచింది. ఎల్సా చిన్ననాటి పాత్రకు సితార, పెద్దమ్మాయి పాత్రకు నిత్యామీనన్ గళాన్ని అందించారు. మహిళా సాధికారతను చర్చించే సినిమా ఇది అన్నారు.


నిత్యామీనన్ మాట్లాడుతూ ఎల్సా పాత్రకు నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఎల్సా క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడం గొప్ప గౌరవంగా భావించా. చిన్నారులను ఎంతగానో ప్రభావితం చేసిన పాత్ర ఇది. నాలోనూ ఎల్సా గుణాలు కనిపిస్తాయి. డిస్నీ సంస్థ తీసిన లయన్ కింగ్ సినిమా అంటే చాలా ఇష్టం అని చెప్పింది. సితార మాట్లాడుతూ ఎల్సా నాకెంతో ఇష్టమైన పాత్ర. డబ్బింగ్ చెబుతూ ఎంజాయ్ చేశాను. ఎల్సా నా ఫేవరేట్ యానిమేషన్ క్యారెక్టర్. ఈ సినిమా కోసం నేనూ ఎదురుచూస్తున్నా అని చెప్పింది. నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ ఫ్రోజెన్ కథ వింటూ పెరిగింది సితార. ఆ క్యారెక్టర్‌తో సితార బాగా కనెక్ట్ అయింది. పిల్లల అభిరుచుల్ని ప్రోత్సహించే విషయంలో నేనెప్పుడూ ముందుంటా అని చెప్పింది.

446

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles