ఉద్వేగభరిత ప్రయాణం

Mon,October 7, 2019 12:20 AM

స్వీయ నిర్మాణంలో రాకేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. బసవశంకర్ దర్శకుడు. గార్గేయి ఎల్లాప్రగడ కథానాయిక. ఈ నెల 8న ప్రమఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ సినిమా చూశాను. చాలా బాగుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. మంచి రిలీజ్ డేట్‌కోసం తొమ్మిది నెలలు నిరీక్షించారు. సినిమాలో వినోదం, భావోద్వేగాలు చక్కగా పండాయి అన్నారు. ఈ సినిమా ఓ ఉద్వేగభరిత ప్రయాణం. విడుదలకు సహకరిస్తున్న దిల్‌రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకుంటుంది అని రాకేష్ తెలిపారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించాం. ప్రేమికులకు మనోభావాలకు దర్పణంలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే విశ్వాసం ఉంది అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో హారతి అనే అమ్మాయిగా అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నానని కథానాయిక గార్గేయి చెప్పింది. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, తరుణ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.511

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles