హాలీవుడ్ సినిమాలా అనిపించింది!


Tue,August 6, 2019 12:54 AM

Evaru Movie Trailer Launch Event Highlights  Nani  Adivi Sesh  Regina Naveen Chandra

ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాలా ఉంది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది. వినూత్నమైన కథాంశంతో ధైర్యంగా ఈ సినిమా చేశారు అని అన్నారు హీరో నాని. అడివిశేష్, రెజీనా, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎవరు. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో హీరో నాని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శేష్ నటించిన గూఢచారి ప్రచార చిత్రాన్ని నేనే విడుదలచేశాను. ఆ సెంటిమెంట్‌తోనే బాధ్యతగా భావించి ఈ వేడుకకు వచ్చాను. సినిమాలో శేష్, రెజీనా అభినయం బాగుంది అని తెలిపారు.

అడివిశేష్ మాట్లాడుతూ నేను ఇష్టపడిన, బాగా నమ్మిన సినిమా ఇది. ఇందులో ప్రతి పాత్ర ద్విముఖాలతో కనిపిస్తుంది. ప్రతి పది నిమిషాలకు మనస్తత్వాలు మారిపోతూ వినూత్నంగా ఉంటాయి. దర్శకుడు ఈ కథ చెబుతున్నప్పుడు మలుపుల్ని నేను కూడా ఊహించలేకపోయాను. హీరోగా ఏ నిర్మాత నన్ను నమ్మని సమయంలో పీవీవీ నాపై నమ్మకం ఉంచారు. ఆ గౌరవంతోనే క్షణం తర్వాత మళ్లీ ఆయనతో ఈ సినిమా చేస్తున్నాను అని అన్నారు. రెండేళ్ల క్రితం ఈ కథ విన్నానని, మంచి సినిమాను నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నానని నిర్మాత పీవీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్బూరి రవి, గ్యారీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.

642

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles