శ్రీనివాస్ సక్సెస్ చూసి ఆనందపడుతున్నా!


Thu,August 8, 2019 11:02 PM

Director VV Vinayak Press Meet About Rakshasudu

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాలోనే ఉత్తమ నటనను కనబరిచాడు. ఇక రాక్షసుడులో ఆద్యంతం కథలో లీనమై నటించాడు. తాను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకున్నాడు. అతను భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు వి.వి.వినాయక్. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన రాక్షసుడు చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. కోనేరు సత్యనారాయణ నిర్మాత. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వి.వి.వినాయక్ రాక్షసుడు సినిమా గురించి తన మనోభావాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ నేను పరిచయం చేసిన సాయిశ్రీనివాస్ ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని చూసి అతని కన్నా ఎక్కువగా నేను ఆనందపడుతున్నా. చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ నాకు మంచి మిత్రుడు. సహృదయుడు. వాళ్లబ్బాయి కథానాయకుడిగా ఉన్నా...ఈ కథకు సాయి కరెక్ట్ అని భావించి సినిమా నిర్మించడం గొప్ప విషయం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. రీమేక్ చేయడం సులభమని భావిస్తారు. కానీ చాలా కష్టం.

ఈ సినిమా తమిళ వెర్షన్ చూశాను. అందులోని టెంపో మిస్ అవకుండా రమేష్‌వర్మ సమర్థవంతంగా రూపొందించాడు. అసలు దర్శకత్వం వైపు ఎందుకు వచ్చావు అని ఓ సందర్భంలో రమేష్‌వర్మను అడిగాను. 800 సినిమాలకు డిజైనర్‌గా పనిచేసి బోర్‌కొట్టి దర్శకుడినయ్యాను సార్ అని చెప్పాడు. కొంతకాలానికి ఏపనినైనా బోర్‌కొడుతుంది. కానీ దర్శకత్వం బోర్ కొట్టదు. ఈ బ్యానర్‌లో రమేష్‌వర్మ మరిన్ని సినిమాలు తీయాలి. ఆయన పెద్ద దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. నేను డైరెక్ట్ చేసినఅల్లుడు శీను చిత్రంలో సాయిశ్రీనివాస్‌లోని అన్ని కమర్షియల్ కోణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. అది ఒక మ్యాజిక్‌లా వర్కవుట్ అయింది. సాయిని అన్ని సినిమాల్లో మంచి ఆర్టిస్టుగా గుర్తించారు. లేకపోతే ఇన్ని చిత్రాలు చేయలేడు. తొలినుంచి కెరీర్ విషయంలో అతను పరిణితితో ఆలోచిస్తున్నాడు. ప్రతి సినిమాకు తనని తాను వృద్ధి చేసుకుంటున్నాడు. కథానుగుణంగా నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. అవకాశం వస్తే భవిష్యత్తులో సాయిశ్రీనివాస్‌తో పెద్ద సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకు మంచి కథ కుదరాలి అన్నారు.

534

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles