మురుగదాస్ సలహా ఇచ్చారు!

Sun,December 1, 2019 11:50 PM

‘నిజాయితీగా మేము చేసిన ప్రయత్నానికి సానుకూల స్పందన లభిస్తున్నది. సినిమా చూసిన వారంతా బాగుందని అంటున్నారు’ అని అన్నారు టి. సంతోష్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నిఖిల్, లావణ్యవూతిపాఠి జంటగా నటించారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు సంతోష్ పాత్రికేయులతో ముచ్చటించారు.


‘కణితన్’ సినిమా చూసిన హీరో నిఖిల్ రీమేక్ ఆలోచనతో తమిళ నిర్మాతను కలిశారు. ఈ సినిమా చేసే వరకు నిఖిల్ గురించి నాకు తెలియదు. లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న అతడు పరిణితితో కూడిన ఈ పాత్రకు న్యాయం చేయగలడా లేదా అని తొలుత సందేహించాను. ఈ పాత్ర కోసం పదిహేనుకిలోల బరువు పెరిగాడు నిఖిల్. అర్జున్ పాత్రలో ఒదిగిపోయారు. ఒకసారి చేసిన కథతో మళ్లీ సినిమా చేయడానికి ఏ దర్శకుడు ఇష్టపడడు. తొలుత నేను అలాగే ఆలోచించాను. కన్నడ రీమేక్‌ను తెరకెక్కించే అవకాశం వస్తే తిరిస్కరించాను. తెలుగు సినిమాల మార్కెట్ పరిధి విస్త్రక్షుతంగా ఉంటుంది. టాలీవుడ్ సినిమా చేయడమంటే చాలా మంది తమిళ దర్శకులు ప్రమోషన్‌గా భావిస్తుంటారు. ఆ ఆలోచనతో పాటు తెలుగు ఇండస్ట్రీపై ఉన్న అభిమానంతో రీమేక్‌కు దర్శకత్వం వహించాను. భవిష్యత్తులో తెలుగులో సినిమాలు చేస్తాను. తమిళ మాతృకతో పోలిస్తే తెలుగులో అదనంగా భావోద్వేగాల్ని జోడించాం. అవన్నీ సత్ఫలితాన్నిస్తున్నాయి.

మురుగదాస్ దగ్గర శిష్యరికం..

దర్శకుడు మురుగదాస్ దగ్గర ‘సెవంత్‌సెన్స్’, ‘తుపాకి’ చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. ‘కణితన్’ సినిమా తనకు బాగా నచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగులో ఈ సినిమాను పునర్నిర్మించే అవకాశం వస్తే వదులుకోకని మురుగదాస్ సలహా ఇచ్చారు. పాత్రికేయుల్లోని ఐకమత్యాన్ని చాటిచెప్పే సినిమా ఇది. ఆ పాయింట్‌నే పతాక ఘట్టాల్లో చెప్పాను. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. సినిమా విడుదల ఆలస్యమవడం బాధించింది. ప్రతి రంగంలో కష్టసుఖాలుంటాయి. సినీరంగం అందుకు అతీతం కాదు. కథపై ఉన్న నమ్మకంతో ఎనిమిదినెలలు ఎదురుచూశాం. ఆ నిరీక్షణకు విజయం రూపంలో ఫలితం దక్కింది. షూటింగ్ సందర్భంగా నిఖిల్‌తో విభేదాలు వచ్చాయన్న మాట అవాస్తవం. అతడు నా పనిలో జోక్యం చేసుకోలేదు. కథ బాగా రావడానికి మేమిద్దరం చాలా చర్చలు జరిగాయి. అయితే మా వాదనలన్నీ నాలుగు గోడలవరకే పరిమితం.రూమ్‌దాటి బయట అడుగుపెడితే స్నేహితులమయ్యేవాళ్లం. దర్శకుడిగా రియలిస్టిక్ ఇతివృత్తాలతో కూడిన సినిమాలు చేయాలనుంది. తదుపరి సినిమా సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి.

534

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles