‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్ ఆవిష్కరణ

Sun,December 8, 2019 11:26 PM

‘సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అమరం అఖిలం ప్రేమ’అనే టైటిల్ చాలా పాజిటివ్‌గా వుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సుకుమార్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్ దర్శకత్వంలో వీఆర్ చలనచివూతాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాత ప్రసాద్‌తో నాది 20 ఏళ్ల ప్రయాణం. లెక్చరర్స్‌గా ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రసాద్ ఈ చిత్రంతో నిర్మాతగా మారడం ఆనందంగా వుంది. విజయ్ రామ్‌ను హీరోగా చూడాలనేది ఆయన తండ్రి కోరిక. నటుడిగా అన్ని రకాల ఎమోషన్స్ పండించడమే ఓ హీరోకు కావాల్సిన అర్హత. అది విజయ్‌రామ్‌లో వుంది. ఈ చిత్ర దర్శకుడు జోనాథన్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు.


ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. రసూల్ ఎల్లోర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. సుకుమార్ తనను గుర్తించి హీరోగా ఎంకరేజ్ చేశారని హీరో విజయ్‌రామ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సుకుమార్ గారు లేకపోతే ఈ రోజు నేను దర్శకుడిగా మీ ముందు ఉండేవాడ్ని కాదు. మొదటి నుంచి ఆయన ప్రోత్సాహం ఎంతో వుంది. ఎంతో వ్యయ ప్రయాసలతో నిర్మాత ప్రసాద్ ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. ‘బొమ్మరిల్లు’తో జెనీలియాకు ఎంత మంచి పేరు వచ్చిందో నాయిక శివశక్తికి ఈ చిత్రంతో అంత పేరు వస్తుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నా మీద ప్రేమతో ఈ వేడుకకు విచ్చేసి, మమ్మల్ని ప్రోత్సాహిస్తున్న సుకుమార్, కొరటాల శివకు నా కృతజ్ఞతలు. ఈ చిత్రం అందరి ప్రశంసలు పొందుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఈ కార్యవూకమంలో దర్శకుడు భరత్‌కమ్మ, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రథన్, నటుడు శ్రీకాంత్, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా, జక్కా హరివూపసాద్ తదితరులు పాల్గొన్నారు.

319

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles