థ్రిల్లర్‌ ‘దర్పణం’


Tue,August 20, 2019 11:40 PM

Darpanam movie release date Announced

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దర్పణం’. రామకృష్ణ వెంప దర్శకుడు. శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. అదే కోవలో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందా? అని ఉత్కంఠతో ఎదురు చూసేలా ఆద్యంతం అసక్తికరంగా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకముంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సెన్సార్‌ పూర్తయింది. చిత్రాన్ని సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సంగీతం: సిద్ధార్థ్‌ సదాశివుని, ఎడిటింగ్‌: సత్య గిడుతూరి.

164

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles