ఫొటోగ్రాఫర్ ్రప్రేమ్‌కహానీ


Tue,August 20, 2019 12:30 AM

choosi choodamgane first look

తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్‌పై రాజ్‌కందుకూరి నిర్మిస్తున్న చిత్రం చూసీ చూడంగానే. శేష సింధురావు దర్శకురాలు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్నది. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాత డి. సురేష్‌బాబు విడుదలచేశారు. ఈ పోస్టర్‌లో శివ కందుకూరి కెమెరాతో ఫొటోతీస్తూ కనిపిస్తున్నారు. నిర్మాత రాజ్‌కందుకూరి మాట్లాడుతూ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఓ జంట ప్రేమ ప్రయాణంలోని మధురభావాలకు అందమైన దృశ్యరూపంగా ఈ సినిమా ఉంటుంది. పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్‌గా శివ కందుకూరి పాత్ర నవ్య పంథాలో సాగుతుంది. కథానాయకుడి పాత్రను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున ఫస్ట్‌లుక్ విడుదల చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేదరామన్, సంభాషణలు: పద్మావతి విశ్వేశ్వర్, ఎడిటర్: రవితేజ గిరిజాల.

251

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles