40కోట్లకు ‘సైరా’ డిజిటల్‌ రైట్స్‌


Wed,September 11, 2019 12:38 AM

Chiranjeevi Sye Raa Narasimha Reddy earns Rs 40 crore even before its release

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘సైరా’ విడుదలకు ముందే బిజినెస్‌పరంగా సంచలనాల్ని సృష్టిస్తున్నది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులు దాదాపు 40కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని సమాచారం. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా అందుబాటులోకి రానుంది. డిజిటల్‌ రైట్స్‌కు ఇంత భారీ మొత్తంలో ఆర్జించడం దక్షిణాదిన ఓ రికార్డ్‌ అని భావిస్తున్నారు. 18 శతాబ్దానికి చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాత. అమితాబ్‌బచ్చన్‌, విజయ్‌సేతుపతి, సుదీప్‌, నయనతార, తమన్నా ప్రధాన పాత్రధారులు. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

785

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles